ఖబడ్దార్ ఇమ్రాన్ : నసీరుద్దీన్ షా

తన వ్యాఖ్యలకు మద్దతు సాకుతో ఇమ్రాన్ ఖాన్ భారత్ పై విషం కక్కడాన్ని నటుడు నసీరుద్దీన్ షా తప్పుపట్టారు. సంబంధం లేని విషయాల్లో జోక్యం వద్దంటూ హెచ్చరించారు.

ముందు మీ దేశం సంగతి చూసుకోండి, భారత్ లో సమస్యలు ఉంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తమకు తెలుసునని స్పష్టం చేశారు. ఏడు దశాబ్దాలుగా దేశంలో ప్రజాస్వామ్యయుతంగా జీవిస్తున్నామనీ, ఇక్కడ మైనారిటీల భద్రతకు ప్రమాదం ఏమీ లేదనీ తేల్చి చెప్పారు. మైనారిటీలను ఎలా చూసుకోవాలో పాకిస్థాన్ ను చూసి భారత్ నేర్చుకోవాలంటూ ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను నసీరుద్దీన్ షా ఖండించారు.