గంటన్నరలోనే ప్లాట్ల బుకింగ్ పూర్తి

హ్యాపీ నెస్ట్ ప్లాట్ల బుకింగ్ కు అనూహ్య స్పందన లభించింది.  రెండో దశ ఆన్ లైన్ ప్లాట్ల బుకింగ్ ప్రారంభమైన గంటన్నర వ్యవధిలోనూ పూర్తయ్యింది. 9 టవర్లలోని 900 ప్లాట్ల బుకింగ్ ప్రక్రియ సీఆర్డీయే ఆధ్వరంలో ఈ ఉదయం ప్రారంభమైంది. బుకింగ్ ప్రారంభమైన గంటన్నర వ్యవధిలోనూ మొత్తం 900 ప్లాట్లూ బుక్కైపోయాయి. సీఆర్డీయే కార్యాలయం, బ్యాంకులు, మీ సేవా కేంద్రాల ద్వారా బుకింగ్ సదుపాయం కల్పించడంతో పాటు ఈ సేవా కేంద్రాలలో ఫెసిలియేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్లాట్లు బుక్ చేసుకున్న వారికి తక్షణ రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకులు ఏర్పాట్లు ేశాయి. ఆన్ లైన్ బుకింగ్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా సీఆర్డీయే సర్వర్ల సామర్థ్యం పెంచింది. హ్యాపీ నెస్ట్ ప్లాట్ల బుకింగ్ తొలి దఫాకు కూడా అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.