గజ్వేల్ లో కేసీఆర్ ప్రచార సభ నేడు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఇప్పటి వరకూ 118 నియోజకవర్గాలనూ చుట్టేస్తూ సుడిగాలి పర్యటనలతో కేసీఆర్ ప్రచార సభలు జరిగాయి. రోజుకు సగటున ఆరు సభలలో ఆయన ఇంత వరకూ ప్రసంగించారు.  మొత్తం తెరాస ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాన మోసిన కేసీఆర్ నేడు గజ్వేల్ లో పర్యటిస్తారు. ఎన్నికల ప్రచారానికి చివరిరోజు వరకూ ఆయన తాను పోటీ చేస్తున్న గజ్వేల్ లో ప్రచారానికి రాకపోవడం గమనార్హం.  చివరి రోజున ఆయన గజ్వేల్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.