గుత్తాజ్వాల ఓటు లేదు

నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ల గల్లంతు వ్యవహారంలో అన్నిటికంటే పెద్దగా వివాదంగా మారినది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు లేకపోవడం. ఓటరు గుర్తంపు కార్డు ఉన్నప్పటికీ తన ఓటరు లిస్టులో ఓటు ఎందుకు లేదని ఆమె మీడియా ముందు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. తాను బతికే ఉన్నాననీ ఓటెలా లేకుండా పోయిందనీ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అది పొరపాటేనని నిన్ననే చెప్పారు. అయితే ఈ ఉదయం ఆయన ఒక ప్రకటన చేశారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు ఓటర్ల జాబితాలో లేదని, 2016 నుంచి కూడా ఆమె పేరు ఓటర్ల జబితాలో లేదని వివరించారు. గత రెండేళ్ల నుంచి ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు నమోదు కార్యక్రమం చేపట్టలేదన్నారు.  సరిగ్గా ఎన్నికల ముందే తన పేరు తీసేశారంటూ జ్వాల చేసిన ఆరోపణ కరెక్ట్ కాదని వివరించారు.

SHARE