గోరింటాకు వలన ఏమి జరుగుతుందో తెలుసా??

Share

గోరింటాకు వలన ఆరోగ్యానికి చాలా లాభాలుంటాయి అని  అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గోరింటాకు ను మెత్తగా  రుబ్బుకుని పాదాలకు పెట్టుకుంటే ఇన్ఫెక్షన్, గోళ్లు పుచ్చి పోతాయి.కీళ్ల నొప్పులు , వాపులు  గోరింటాకు నూనెను పైపూతగా తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. గోరింటాకు పెట్టుకునే ఆడవారి లో  మానసిక ఒత్తిడి ఉండదు.గోరింటాకు నువ్వుల నూనెలో వేసి మరిగించి చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే కళ్ల మంటలు,తలనొప్పి,జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు తగ్గుతాయి.

కాండిడా అనబడే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి గోరుపుచ్చిపోతుంటే క్రమం  తప్పకుండ గోరింటాకు రుబ్బి పెట్టుకుంటే వ్యాధి తగ్గి గోరు మాములవుతుంది. అరికాళ్ళు మంట పెడుతున్న కూడా గోరింటాకు మెత్తగా నూరి అరికాళ్ళకు అందంగా పెట్టుకుంటే అరికాళ్ళ మంట తగ్గుతుంది. సెగ గడ్డలు వచ్చి ఎంతకూ పగలకుండా ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ సమయంలో గోరింటాకు మెత్తగా నూరి సెగ గడ్డల పైన వేస్తే సెగ గడ్డలు పగిలి చీము బయటకు పోయి  నొప్పి తగ్గుతుంది. పుండు కూడా త్వరగా మనుబడుతుంది. కాళ్ళు చేతులు మంట పడుతుంటే బియ్యం కడిగిన నీళ్లను పులియబెట్టి వాటిని గోరింటాకు రసానికి  నాలుగు రెట్లు వేసి కలిపి మంట ఉన్న ప్రాంతంలో రాసుకుంటే  ఫలితం ఉంటుంది.

గోరింటాకు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పొడవైన, మృదువైన, మరియు అందమైన జుట్టు పొందడానికి గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది. సహజమైన గోరింటాకు తో పాటు టీ ఆకులు , నిమ్మరసం ,పెరుగు , మరియు ఉసిరికాయ రసం కలిపి ఉపయోగిస్తే మంచి  జుట్టును  పొందవచ్చు . ఇంకా ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీకగా  చెప్తుంటారు.  ఆడవారు  గోరింటాకు పెట్టుకోవడం వలన  సౌభాగ్యాన్ని   పొందుతారని  జ్యోతిష్యులు అంటున్నారు.


Share

Related posts

గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే

somaraju sharma

ఇటు శ్వేత పత్రాలు-అటు కూటమి యత్నాలు

Siva Prasad

ఒక్క రోజులో దాదాపు 4 కోట్ల మంది పుట్టనున్నారు!

Naina