గోహత్యకు పాల్పడిన వారిని నరికేస్తా..!

వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన హైదరాబాద్ ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజా ఎన్నికలలో ఘోషా మహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన ఆయనకు ఈ ఉదయం నియోజకవర్గంలో ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గోహత్యలకు పాల్పడే వారిని అడ్డంగా నరికేస్తానని పేర్కొని సంచలనం సృష్టించారు. ఇక తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. తనను ఓడించడానికి కొందరు ఎన్నో కుట్రలు పన్నారనీ, కానీ ప్రజలు తన వెంటే నిలిచి వాటిని భగ్నం చేశారని రాజాసింగ్ అన్నారు.