గ్యాస్ట్రిక్ సమస్య కోసం ఆ టాబ్లెట్ ని వాడితే క్యాన్సర్ ని కొని తెచుకున్నట్టే??

Share

ప్రస్తుతం ఉన్న జీవన విధానం లో మారిన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో డాక్టర్లు ప్రతి రోజూ  ఉదయం పరగడుపునే ఈ  టాబ్లెట్ వేసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య   తగ్గుతుంది  అంటూ ఓ టాబ్లెట్ ఇస్తున్నారు.  కడుపులో మంట అని చెప్పగానే మందుల షాపు వాళ్లు కూడా  ఆ టాబ్లెట్ చేతిలో పెడతారు. అయితే  ఇప్పుడు ఆ టాబ్లెట్ రోజూ వాడే వాళ్లకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య పరిశోధకులు తెలియచేస్తున్నారు.


ఆ టాబ్లెట్ రాన్‌టాక్  అని మీకు కూడా తెలిసే ఉంటుంది… మనం తినే ఆహారం జీర్ణమై పొట్టలో   గ్యాస్ట్రిక్ యాసిడ్ విడుదల కాకుండాఅడ్డుకోవడానికి ఉపయోగించే ఈ రాన్‌టాక్ టాబ్లెట్‌లో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు ఓ పరిశోధనలో కనుగున్నారు . తాజాగా అమెరికాకు చెందిన ఎఫ్‌.డీ.ఏ.వారు ఈ రాన్‌టాక్ టాబ్లెట్‌లో ‘నైట్రోసోడైమిథైలమైన్’ అని పిలవబడే క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ టాబ్లెట్‌లో NDMA ఉండాల్సిన మోతాదు కంటే అధికం  గా ఉందంట…అలాగే దీని తయారీలో లోపం ఏర్పడడం  వల్ల ఈ కలుషిత మిశ్రమం క్యాన్సర్ ‌కుకారణమవుతుంది అని  డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులుతెలియచేస్తున్నారు. ప్రస్తుతం ఈ రాన్‌టాక్ టాబ్లెట్ వాడకం కొన్ని దేశాలు  నిషేధం  లో నిషేధించబడ్డాయి.

అయితే ఇప్పటికే శాండూజ్ ఫార్మా కంపెనీ ఈ రాంటాక్ టాబ్లెట్ లు  వెనక్కి తీసుకుని నాశనం చేశారు. అయినా ఇంకా మన దేశంతో సహా కొన్ని దేశాల్లో ఇవి చెలామణిలో ఉన్నాయి. ఈ రా‌న్‌టాక్ టాబ్లెట్ వాడే  బదులుగా మార్కెట్లో గ్యాస్ట్రిక్ యాసిడ్ తగ్గే మరెన్నో మందులు అందుబాటులో  ఉండగా వాటిని వాడితే మంచిదని ఎఫ్‌డీఎ తెలియచేస్తుంది . ఇక మీదట గ్యాస్ట్రిక్ కోసం మీరు మెడికల్ షాపులకు వెళితే రాన్‌టాక్ టాబ్లెట్ మాత్రం  అసలు తీసుకోకండి. దానికి బదులుగా వేరే టాబ్లెట్  తీసుకోవడం మంచిది.


Share

Related posts

కొడాలి స్పీడ్ కు బ్రేకులు!! పేకాట క్లబ్ కథ ఏమిటో??

Comrade CHE

బిగ్ బ్రేకింగ్ : ” డాక్టర్ సుధాకర్ ని డిశ్చార్జ్ చేయండి ” ఏపీ హైకోర్టు

somaraju sharma

గ్రేట్ న్యూస్ : కరోనా కి సరైన మందు మార్కెట్ లోకి..! ఏ నెలలో అంటే…

arun kanna