చంద్రబాబు ఢిల్లీ టూర్ 10న

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 10న హస్తినలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ సహా పలు బీజేపీయేతర పార్టీలతో భేటీ కానున్నారు. బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్న ఏరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దాదాపు పదికి పైగా జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలు ఈ భేటీలో పాల్గొంటారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు యత్నాలలో భాగంగా ఈ భేటీ జరుగుతోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు  వ్యతిరేకంగా కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, టీజేస్ లు ప్రజాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాసకు గట్టిపోటీ ఇచ్చిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాట్లను ఇక వేగవంతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.