చంద్రబాబు తిరుపతి టూర్ నేడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతిలో ఈ రోజు పర్యటించనున్నారు.   తిరుపతిలో జరిగే పేదరికంపై గెలుపు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అలాగే  ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలో జరిగే మెగా రుణమేళా  కార్యక్రమంలో పాల్గొని  వివిధ పథకాల  లబ్ధిదారులకు రుణాలు, ఆస్తులు పంపిణీ చేస్తారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఫటో ఎగ్జిబిషన్, స్టాళ్లు చంద్రబాబు చూస్తారు.  ఆ తరువాత శ్రీ వేంకటేశ్వర ఆధ్యాత్మిక వైభవ ఉద్యానవనం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. గత వారం రోజులుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న చంద్రబాబు..అక్కడ ప్రచార గడువు ముగియగానే అమరావతి చేరుకున్నారు. ఈ రోజు నుంచి మళ్లీ రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.