చంపేస్తున్న చలిపులి

పెధాయ్ ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ చలిపులి పంజా విసిరింది. ఆంధ్రప్రదేశ్ లో వర్షానికి తోడు చలి వణికించేస్తుంటే…తెలంగాణలో చలిగాలులు జనం ఎముకలు కొరికేస్తున్నది.

తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఏకంగా 11 డిగ్రీల వరకూ పడిపోయాయి. మొత్తంగా తెలంగాణలోని పలు ప్రాంతాలు చలికి గడ్డకట్టుకుపోయినట్లుగా మారిపోయాయి. ఈ పరిస్థితి మరో మూడు రోజులు ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జనం మరింత వణికిపోతున్నారు. తాండూరులో కనిష్టంగా 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఉదయం ఎనిమిది గంటలకు కూడా తలుపులు తీయాలంటేనే జనం భయపడే పరిస్థితి ఉంది.