చలి ఎముకలు కొరికేస్తోంది

తెలుగు రాష్ట్రాలలో చలి వణిచింకేస్తోంది. ప్రజల ఎముకలు కొరికేస్తున్నది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా శీతల గాలులు తెలుగు రాష్ట్రాలపై పంజా విసిరాయి. సాధారణం కంటే కనీసం 11 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. రోజంతా చలి వణికించేస్తుండటంతో జనం ఇళ్లల్లోంచి రావడానికే భయపడే పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

పెథాయ్ తుపాను ప్రభావం చలిని రెట్టింపు చేసింది. తీవ్రమైన చలిగాలులతో పాటు వర్షం మరిస్థితిని మరింత తీవ్రం చేసింది. హైదరాబాద్ లో కూడా గతంలో ఎన్నడూ లేని విదంగా ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయాయి. విశాఖ మన్యంలో అయితే కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా మైనస్ 7 డిగ్రీలకు పడిపోయింది. ఇదే పరిస్థితి మరో రెండు మూడు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జనంలో మరింత ఆందోళన పెంచుతోంది.