చినజీయర్ స్వామికి తప్పిన ప్రమాదం

త్రిదండి చినజీయర్ స్వామి తృటిల ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ అష్టలక్ష్మి దేవాలయంలో ఆలయ గోపురానికి పూజలు చేస్తున్న సమయంలో ఆలయం చుట్టూ నిర్మించిన వేదిక కూలిపోయింది.

ఈ సంఘటన జరిగిన సమయంలో చినజీయర్ స్వామి గోపురానికి హారతి ఇస్తున్నారు. ఒక్కసారిగా వేదిక కుప్పకూలిపోవడంతో చినజీయర్ స్వామి కిందకు జారిపోయారు. అయితే ఈ ప్రమాదంలో చినజీయర్ స్వామికి ఎటువంటి గాయాలూ తగలలేదు.