చెమట వాసనను ఇలా పోగొట్టుకోండి!!

Share

ఎండలు చెమటకి శరీర దుర్వాసన వస్తుంటుంది ఆ వాసనను భరించడం అనేది చాలా సమస్య గా ఉంటుంది. ఆ సమస్య మనతో పాటు ఎదుటి వారికీ కూడా చాలా ఇబ్బంది గా ఉంటుంది. మరి దీనిని  అరికట్టాలంటే ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది . బేకింగ్ సోడా ను ఉపయోగించి  శరీర దుర్వాసనను తగ్గించుకోవచ్చు..చెమట పట్టే ప్రదేశం లో  బేకింగ్ సోడాను రాయడం వలన ఇది ఆ ప్రదేశాన్ని తేమ లేకుండా ఉంచుతుంది.

ఎండలకు చెమట ఎక్కువగా పడుతుంటుంది. అందుకోసం చంకలలో హెయిర్ తొలగించి ఆ భాగాన్ని వేడినీళ్ళతో యాంటి బాక్టీరియల్‌ సోప్‌ ఉపయోగించి రోజుకు రెండు మూడు సార్లు శుభ్రంగాకడుక్కుంటూ ఉండాలి. స్కిన్‌ పిహెచ్‌ వాల్యూ తక్కువగా ఉంటే కనుక దుర్వాసనకు కారణమైన బ్యాక్టీరియా చర్మంపై ఉండదు. బాక్టీరియాను చంపడానికి నిమ్మకాయలు  కూడా బాగా ఉపయోగపడతాయి . నిమ్మకాయ తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా  కోసి… ఒక భాగం తో చంకల కింది రుద్దాలి.

రోజుకు ఒకసారి ఇలా చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.మనం తినే ఆహారం వల్ల కూడా శరీరం దుర్వాసన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తీసుకునే ఆహారంలో కెఫైన్‌, ఆల్కహాల్‌,మసాలా, వంటివి లేకుండా లేదా  చాలా  తక్కువ  ఉండేలా  జాగ్రత్త  పడాలి.చెమటను తేలిగ్గా తీసుకోవద్దు. అందులో క్రిములు ఉండి వాటి వాసన ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుంది.రెండు పూటలా  స్నానం చేస్తూ.. ఉతికిన కాటన్ బట్టలు కట్టుకుంటూ ఉంటే కూడా ప్రయోజనం ఉంటుంది. ఆరెంజ్ పీల్ పౌడర్  తో నలుగు పెట్టుకుని బాగా రుద్దుకుని స్నానం చేయడం కూడా మంచి ఉపశమనం.


Share

Related posts

కరోనాను జయించాడు.. కానీ మృత్యువు ఎలా వచ్చిందంటే..

Muraliak

Adipurush : ఆదిపురుష్ లో హేమమాలిని.. ప్రభాస్ తల్లిగా ఒప్పుకున్నట్టేనా ..?

GRK

Karunakar : వీళ్ళిద్దరు మళ్ళీ టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా..?

GRK