ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధిక్యతలో కొనసాగున్నది.  ఈ మూడు రాష్ట్రాలలో కూడా అధికారంలో ఉన్న బీజేపీ వెనుకబడింది. రాజస్థాన్ లో 199 స్థానాలకు గాను ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి కాంగ్రెస్ 98, బీజేపీ 73 స్ధానాలలో ఆధిక్యతలో కొనసాగుతుండగా, ఒక స్థానంలో ఇతరులు ఆధిక్యతలో ఉన్నారు. ఇక 90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ లోకాంగ్రెస్ 67 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, బీజేపీ 21, జేసీసీ 8 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. ఇక మధ్య ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తున్నది. 200 స్థానాలున్న మధ్య ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ 109 స్థానాలలో విజయం దిశగా సాగుతుండగా 99 స్థానాలలో బీజేపీ 99 స్థానాలలోనూ ఇతరులు 5 చోట్ల ఆధిక్యతలో ఉన్నది.