ఛత్తీస్ గఢ్ లో హోరాహోరీ-ఎడ్జ్ కాంగ్రెస్ కే

ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యత వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. ఇండియా టుడే ప్రకారం ఈ రాష్ట్రంలో బీజేపీ 46 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ 36 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇతరులు, జేసీసీలు 9 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఇండియా టుడే పేర్కొంటే, సీఎన్ఎన్, న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు స్వల్ప మొగ్గు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి.