జకార్తా : ఇండోనేసియాలో భూకంపం- రిక్టర్ స్కేలుపై 5.6తీవ్రత

ఇండోనేసియాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. ఇండోనేషియాలోని లోంబోక్ ద్వీపంలో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది. దీంతో జనం భయాందోళనలతో ఇళ్ల ల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఇండోనేషియాలో తరచూగా భూమి కంపిస్తుంటుంది. గతంలో సమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం కారణంగా సునామీ వచ్చి లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఉదయం సంభవించిన భూకంపం కారణంగా ఎటువంటి నష్ఠం సంభవించినట్లు సమాచారం లేదు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.