జనవరి 10లోగా తెలంగాణ పంచాయతీ

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 10 లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వచ్చే నెల10లోగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇలా ఉండగా రాష్ట్రంలో పంచయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. పంచాయతీలు, వార్డుల వారిగా ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 13 నుంచి గ్రామాల్లో బీసీల ఓటర్ల జాబితా ప్రచురించాలని ప్రభుత్వం నిర్ణయించింది.