జీవితం ఆనందంగా ఉండాలా?? అయితే ఇలా చేసి చూడండి!!

Share

జీవితం ఆనందంగా సాగాలంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించవలిసిందే.. అలా కొన్ని నియమాలు పెట్టుకుని కొద్ది రోజులు పాటించి చూడండి ఎలాంటి మార్పు కనబడుతుందో..  మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మన మనస్సు కూడా అలాగే ఉంటుంది అంది ఇప్పటికే నిరూపితం అయ్యింది. కానట్టి మంచి  ఆహారం తీసుకుంటూ,  జంక్ ఫుడ్ ను   దూరం గా ఉండాలి. ఎంత సాత్విక ఆహారం తీసుకుంటే మనస్సు అంత ప్రశాంతంగా ఉంటుంది.

ఏదైనా పని ఉంటే తప్ప ఫోన్ ముట్టుకోకండి. పని అయ్యాక అదేపనిగా సోషల్ మీడియా  లో విహారం చేస్తూ లేనిపోని తలనొప్పి ,కంటి సమస్యలు , మానసిక సమస్యలు తెచ్చుకోకుండా ఉంటే జీవితం ప్రశాంతం గా గడుస్తుంది.
నిద్రపోయే ముందు వరకు ఫోన్  అసలు చూడకండి.. ఇలా చేయడం వలన నిద్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది నిద్ర కావాలనుకున్నప్పుడు అరగంట ముందు  మొబైల్ దూరం గా పెట్టండి. మంచి ప్రశాంతమైన నిద్ర మనస్సు ప్రశాంతం గా ఉండేలా చేస్తుంది.
రోజు మొత్తంలో ఎంత కుదిరితే అంత  ఎక్కువగా వాకింగ్ చేయాలి. ఇది మీకు ఒత్తిడిని తగ్గిస్తుంది.
రోజు మొత్తం లో ఎంత ఎక్కువ నడిచిన కూడా రోజులో కనీసం పావుగంట సేపు వ్యాయామం చేయడానికి ప్రయత్నం చేయండి.

జలుబు, తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకోవడం  బదులు సహజమైన  చిట్కాలు పాటించడం ఉత్తమం..
.మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు.
అని ఆలోచించి మనస్సు పాడుచేసుకోకండి.. మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా అందర్నీ మెప్పించడం చాలా చాలా కష్టం అని గుర్తుపెట్టుకోండి..పెద్దలు చెప్పిన మంచి మార్గం లో జీవితాన్ని కొనసాగించండి.
ఎంత కష్టమొచ్చినా కృంగిపోకుండా.. కష్టాలు శాశ్వత గా ఉండవు.. అలాగే సుఖాలు కూడా ఉండవు రెండు మారుతుంటాయి అని గుర్తు పెట్టుకోండి..
మీ ఆనందానికి మీరు తప్ప  ఇంకొకరు కారణం కాదు.కాకూడదు. ఎవ్వరి మీద  మీ సంతోషం ఆధారపడి లేదు అని గమనించండి.
మీకు ఉన్నదానితో  తృప్తి పడండి..  మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకో కండి.వాళ్ళ జీవితంలో  ఎంత ఇష్టముందో,బాధ ఉందో మీకు
మీకు తెలియదు కదా.. ప్రతి దానికి ఎక్కువగా  ఆలోచించకుండా ప్రతి నిమిషాన్ని ఆనందంగా ఆహ్లాదంగా గడిపేయండి..


Share

Related posts

జ‌గ‌న్ ఊహించ‌ని దెబ్బ‌కొట్ట‌నున్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ ?

sridhar

Big Boss: బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రగతి..!!

sekhar

బిగ్ బాస్ 4: హౌస్ లో బిగ్ బాస్ నుండి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న టాప్ కంటెస్టెంట్..??

sekhar