జీశాట్-11 ప్రయోగం విజయవంతం-ఇస్రో ఖాతాలో మరో విజయం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది. ఈ రోజు ఉదయం ఇస్రో జీశాట్ -11 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్ గయానా కౌర్ నుంచి ఈ ఉదయం ఇస్రో జీశాట్-11 ఉపగ్రహాన్ని అంతరిక్ష్యంలోనికి విజయవంతంగా పంపింది. ఇంటర్నెట్, సమాచార వ్యవస్థల బలోపేతానికి ఈ శాటిలైట్ దోహదపడుతుంది.