టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి

శేషాచలం అడవులు కాల్పులతో దద్దరిల్లాయి. టాస్క్ ఫోర్స్ సిబ్బంది శేషాచలం అడవులలో కూలంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుపడిన ఎర్రచందనం స్మగ్లర్లు వారిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పరారయ్యారు. ఈ సంఘటలనో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. పరారైన స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను వదిలేసి పారిపోయారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఎర్రచందనం దుంగలే కాకుండా జంతువుల అవయవాలు కూడా ఉన్నాయి.

దాదాపు 80 మంది స్మగ్లర్లు ఉన్నారనీ, తాము ఎదురు పడగానే స్మగ్లర్లు రాళ్లు రువ్వుతూ దాడికి పాల్పడ్డారనీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది చెప్పారు. దీంతో అనివార్యంగా ఆత్మరక్షణ కోసం తాము గాలిలోకి కాల్పులు జరిపినట్లు చెప్పారు. స్మగ్లర్లు పరారయ్యారనీ, సంఘటనా స్థలం నుంచి 50 ఎర్రచందనం దుంగలు, జంతువుల అవయవాలు స్వాధీనం చేసుకుని…పరారై వారి కోసం గాలిస్తున్నట్లు వారు చెప్పారు.

SHARE