తూచ్…ఒట్టిదే..నమ్మొద్దు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తమ ఎగ్జిట్  పోల్ నమ్మవద్దని ఇండియా టుడే ఎడిటర్ స్వయంగా చెప్పారట. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు విలేకరుల సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. తాము ఎగ్జిట్ పోల్ లో అంచనా వేసినట్లుగా  ఫలితాలు ఉండబోవని రాజ్ దీప్ తనతో స్పష్టంగా  చేప్పారని, క్షేత్ర  స్థాయిలో ప్రభుత్వ  వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తున్నదని  రాజ్ దీప్  చెప్పారట. అంటే నిన్న  ఎగ్జిట్ పోల్ ప్రసారం చేసేసి  ఈ  రోజు తూచ్…అంతా ఒట్టిదే…దానిని నమ్మొద్దని రాజ్ దీప్ సెలవిచ్చారన్న మాట.