తెలంగాణలో కూటమిదే అధికారం : లగడపాటి ఎగ్జిట్ పోల్

లగడపాటి ఎగ్జిట్ పోల్ తెలంగాణలో అధికారం ఎవరిదన్నది చెప్పేసింది. ఆంధ్రా ఆక్టోపస్ గా గుర్తింపు పొందిన లగడపాటి సర్వేలు కచ్చితత్వంతో ఉంటాయన్న భావన ఉంది. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో తన ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలలో ప్రజాకూటమి 65-75 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందన్నారు. అలాగే తెరాసకు 35 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందులో పది స్థానాలు అటూ ఇటూ ఉండొచ్చని పేర్కొన్నారు. ఇక ఎంఐఎం 6 లేదా ఏడు స్థానాలలో విజయం సాధిస్తుందన్నారు. బీజేపీ 7 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయన్నారు. ఇండిపెండెంట్లు 7 స్థానాలలో గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు.