తెలంగాణలో కొనసాగుతున్న కారు జోరు

ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు గద్వాల నియోజకవర్గంలో మాజీ మంత్రి డీకే ఆరుణ వెనుకబడ్డారు. అలాగే తాండూరులో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. అలాగే కొల్లాపూర్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యత కనిపిస్తున్నది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యతలో ఉంటే నల్గొండ జిల్లాలో ఐదు స్థానాలలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. బాన్సువాడలో పోచారం శ్రీనివారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు టీఆర్ఎస్ 51 స్థానాలలో, కాంగ్రెస్ కూటమి 31 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి.బీజేపీ రెండు చోట్ల, ఎంఐఎం7 స్థానాలు, ఇతరులు 2 స్థానాల్లో ఉన్నాయి. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా, ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి అజయ్ కుమార్ ఆధిక్యం, పాలేరులో తుమ్లల నాగేశ్వర్ రావు ఆధిక్యం, సిద్దిపేటలో రెండో రౌండ్ లో 13 వేల ఆధిక్యంలో హరీష్ రావు, ములుగులో సీతక్క ఆధిక్యం, మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్. కృష్ణయ్య ఆధిక్యంలో ఉన్నార,మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ముందంజ, *ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి ఆదిక్యం, *ముథోల్ లో టీఆర్ఎస్ ఆధిక్యం