తెలంగాణలో పోలింగ్ ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా, పోలింగ్ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.81 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్ కార్డు లేకపోయినా ఎన్నికల సంఘం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపి ఓటు వేయవచ్చు.