తెలంగాణలో భారీగా పెరిగిన పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. పోలింగ్ గడువు ముగిసే సమయానికి పోలింగ్ శాతం గత రికార్డులను అధిగమించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. పోలింగ్ శాతం పెరుగుతున్న సూచనలు కనిపించడంతో అభ్యర్థుల జయాపజయాలపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణలో ఓటింగ్ శాతం 70కి పెరిగితే ఫలితం ఒకలా, తగ్గితే మరోలా ఉంటుందన్న విశ్లేషకుల అంచనాల ప్రకారం వివిధ పార్టీల శ్రేణులలో కూడా చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఇప్పటి వరకూ ఒకటి రెండు చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరగడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతున్నది.