తెలంగాణ ఓట్ల లెక్కింపు షురూ

తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 7న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. మొత్తం 43 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాల ఉన్నాయి. ప్రజాకూటమి, తెరాస హోరాహోరాగా తలపడ్డాయి. విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెరాస విజయం సాధిస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపడతారు. అదే ప్రజాకూటమి విజయం సాధిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో సీఎం పదవి కోసం పలువురు సీనియర్ నాయకులు కూడా రేస్ లో ఉంటారని భావిస్తున్నారు. ఏది ఏమైనా తెరాస, కాంగ్రెస్ లు ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తరువాత లెజ్లిస్లేచర్ పార్టీ సమావేశాలు నిర్వహించి నాయకుడిని ఎన్నుకుంటాయి.