తొలి ఆధిక్యతల్లో కాంగ్రెస్ ముందు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు షురూ అయ్యింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన పావు గంటలో మిజోరాం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో తొలి ఆధిక్య్తలు వెలువడ్డాయి. నాలుగు చోట్లా కూడా కాంగ్రెస్ ఒకింత ముందు ఉంది. తెలంగాణలో మూడు స్థానాలలో ఆధిక్యతలు వెలువడగా వాటిలో రెండు కాంగ్రెస్ కూటమి, ఒక చోట తెరాస ఆధిక్యతలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో ఐదు స్థానాలకు గాను మూడు చోట్ల కాంగ్రెస్, బీజేపీ ఒక చోట ఆధిక్యత కనబరుస్తున్నాయి. రాజస్థాన్ లో నాలుగు కాంగ్రెస్, ఒకటి బీజేపీ ఆధిక్యత కనబరుస్తున్నది. ఛత్తీస్ గఢ్ లో మూడు చోట్ల కాంగ్రెస్, ఒక చోట బీజేపీ ఆధిక్యత కనబరుస్తున్నాయి.