త్రిపుర :బస్సులోయలో పడి పలువురికి గాయాలు-పాతిక మంది పరిస్థితి విషమం

త్రిపురలో బస్సులోయలో పడిన ఘటనలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులలో పాతిక మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఈ దుర్ఘటన జరిగింది. ధలాయ్ జిల్లా గందచర అమర్ పూర్ ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.