దక్షిణ కోస్తాకు తుపాను గండం

తుపాను ముప్పుతో దక్షిణ కోస్తా వణుకుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారింది. ఇది ఈ నెల 17న మధ్య కోస్తా వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనీ, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. మత్స్య కారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.తుపాను ప్రభావంతో రేపు సాయంత్రం నుంచీ కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను సందర్భంగా ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.  నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుంది. తుపాను ప్రభావం ఉండే జిల్లాల్లో అధికారులు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఇక తుపాను రైతు గుండెల్లో గుబులు పట్టిస్తోంది. పంట నష్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది.
  భారీవర్షాలు కురిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం  ఉంది.