దిగ్గీ రాజాకు అరెస్ట్ వారెంట్

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.  హైదరాబాద్ లోని పాంపల్లి కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఎన్నికలలో వివిధ రాష్ట్రాలలో ఎంఐఎం పోటీ కేవలం డబ్బుల కోసమేనని దిగ్విజయ్ సింగ్ గతంలో అసదుద్దీన్ ఒవైసీ పై విమర్శలు గుప్పించిన సంగతి విదితమే. ఆ వ్యాఖ్యలపై ఎంఐఎం నాయకుడు జాఫర్ హుస్సేన్ దిగ్విజయ్ పై పరువునష్టం కేసు వేశారు. అయితే ఈ కేసు విచారణకు హాజరు కావలసిందిగా పలు మార్లు దగ్విజయ్ కు సమన్లు పంపినా ఆయన హాజరు కాలేదు. దీంతో నాంపల్లి కోర్టు ఆయపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.