దూసుకొస్తున్న పెథాయ్-వణుకుతున్న కోస్తా

ఆగ్నేయ బంగాళాఖాతంలో  ఏర్పడిన వాయుగుండానికి వాతావరణ శాఖ అధికారులు పెథాయ్ అని పేరుపెట్టారు.దీని ప్రభావం కోస్తాపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అకాలంలో దూసుకొస్తున్న పెధాయ్ కోస్తా జిల్లాలలను వణికిస్తున్నది.  తుఫాను ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తుఫాను చెన్నైకి దక్షిణ ఆగ్నేయ దిశగా 1,040 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,210 కిలోమీటర్ల దూరంలో ఉంది.శనివారం నాటికి ఇది పెను తుఫానుగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. కోస్తా తీరం వెంబడి ప్రస్తుతం 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తుండగా, తుపాను తీరం దాటే సమయానికి వీటి వేగం 100 కి.మీ. వరకూ పెరగవచ్చని చెబుతున్నారు. మధ్య కోస్తా ప్రాంతంలో పెధాయ్ ఈ నెల 17 ఉదయం ఇది తీరాన్ని దాటవచ్చని అధికారులు అంచనావేశారు. . ఇప్పటికే కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక తుపాను సమాచారం కోసం ఆర్డీఓ కార్యాలయాలలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.

SHARE