నలుపు లేని అండర్ ఆర్మ్స్ కోసం తీసుకోవాలిసిన జాగ్రత్తలు పాటించవలిసిన  చిట్కాలు తెలుసుకోండి !!( పార్ట్-2)

Share

ఒక బంగాళదుంప ను తీసుకుని  తొక్క తీసి రెండు ముక్కలు గా చేసి అందులో  ఒక ముక్క తో  చంకల్లో మృదువుగా మసాజ్ చేసుకోవాలి.ఇది  చర్మంపై ఏర్పడే మచ్చలు ,నలుపు  తగ్గించడం లో బాగా పనిచేస్తుంది.
నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు చంకల్లో ఏర్పడే నలుపుదనాన్ని బాగా తగ్గిస్తాయి. తాజా నిమ్మరసాన్ని తీసుకుని చంకల్లో రాసుకుని  కొద్దిసేపు  మసాజ్ చేసుకుని ఆరనివ్వడం వలన  నలుపు ధనాన్ని తగ్గించుకోవడంతో పాటు చెమట వలన వచ్చే  దుర్వాసన కూడా తగ్గించుకోవచ్చు.


చంకల్లో నలుపు ధనాన్ని తగ్గించడంలో బొప్పాయి గుజ్జు తో పాటు బొప్పాయి జ్యూస్ కూడా  ప్రభావవంతంగా పనిచేస్తాయి.
కొన్ని పచ్చి పాలు తీసుకొని చంకల్లో అప్లై చేసి  15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి ..అలాగే కొంచెం పెరుగు తీసుకుని అందులో చిటికెడు  పసుపు మరియు కొంచెం  తేనెను కలిపి అప్లై చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది .
కలబంద ముక్కను కోసి అందులో జెల్ వంటి పదార్థాన్ని తీసుకుని చంకలో రాస్తే నలుపు బాగా తగ్గిపోతుంది.

నారింజ తొక్కలను ఎండబెట్టి పౌడర్‌ చేసుకోవాలి . ఓ గిన్నెలో రెండు చెంచాల నారింజ తొక్కల పొడి, రెండు స్పూన్ల పెరుగు వేసి బాగాకలిపి  అండర్ ఆర్మ్స్‌కి  రాసి ఓ అరగంటపాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. రెండు రోజులకు ఒకసారి ఇలా చేయడం వలన నలుపును సమర్ధవంతం గాతగ్గించుకోవచ్చు.ఈ పద్ధతిలో మీకు సరిపోయే వాటిని ఎంచుకుంటే క్రమం తప్పకుండా పాటించడం వలన చాలా మంచి ఫలితం వస్తుంది.మార్పు వచ్చే వరకు మీరు ఎంచుకున్న పద్దతి వదలకుండా ప్రయత్నం చేయండి.


Share

Related posts

శృంగార జీవితం ప్రతి రోజు రసవత్తరంగా సాగాలంటే…ఇలా చేయండి!!

Kumar

Ghee tea: “ఘీ” టీ ఎప్పుడైనా ట్రై చేసారా?  

Kumar

ఆ స్టార్ హీరో కూడా విలన్ మారిపోయాడుగా!

Teja