ఇల్లు చిన్నది.. కానీ నా హృదయం విశాలం : చౌహాన్

నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం ఆయన.  ముఖ్యమంత్రిగా ఉన్నా…అధికారం కోల్పోయినా ఆయన వ్యవహార శైలిలో ఎలాంటి మార్పూ ఉండదు. సీఎంగా ఆయన ఎంత సామాన్యంగా మెలుగుతారో…ప్రజలతో ఎలా మమేకమౌతారో…అధికారం కోల్పోయిన అనంతరం కూడా ఆయన అదే తీరున వ్యవహరిస్తారు. సీఎంగా అధికార దర్పం చూపినది లేదు.

ఆయనే మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన వెంటనే ఆయన తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి మరో ఇంటికి మారిపోయారు. ఆ ఇల్లు చాలా చిన్నది. పదిహేనేళ్ల పాటు సీఎంగా ఉన్న ఆయన ఆ పదవి నుంచి వైదొలగగానే ఏ మాత్రం సంకోచించకుండా చిన్న ఇంటికి మారిపోయారు. ఆయన కోరుకుంటే పెద్ద ఇంటినే ఎంచుకునే వారు. కానీ ఆయన చాలా చిన్ని ఇంటికి మారారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తాని నివసించే ఇల్లే చిన్నది కానీ హృదయం చాలా విశాలం అని చెప్పారు. తన హృదయం అంతా మధ్య ప్రదేశ్ ప్రజలే ఉన్నారనీ, రాష్ట్ర అభివృద్ధికీ, ప్రజల సంక్షేమానికీ తాను సదా సిద్ధంగా ఉంటానని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.