నిబంధనలంటే లెక్కలేదా?

ఆయన నిన్న మొన్నటి వరకూ మంత్రి…ఇప్పుడు ఆపద్ధర్మ మంత్రి. అయినా ఎన్నికల నిబంధనలంటే ఇసుమంతైనా ఖాతరు లేదా  అనిపించేలా వ్యవహరించారు.  పోలింగ్ బూత్ వద్ద పార్టీల ప్రచారం కూడదని కొత్తగా ఓటరుగా నమోదైన వ్యక్తికి కూడా తెలుసు. అలాంటిది మంత్రి స్థాయి వ్యక్తికి తెలియదంటే నమ్మగలమా? ఆపద్ధర్మ మంత్రి, తెరాస నాయకుడు జగదీశ్వరరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయనను అరెస్టు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంతకూ పోలింగ్ బూత్ లో తన ఓటు వేసి బయటకు వచ్చిన తరువాత  చేసిన వ్యాఖ్యలేమిటంటే…కాంగ్రెస్ కు ఓటేస్తే చంద్రబాబుకు, అమరావతికీ వేసినట్లే  అంటూ తమ పార్టీకే ఓటేయండని పరోక్షంగా అక్కడ ఉన్న ఓటర్లకు చెప్పారు. దీనిపై కాంగ్రెస్ కూటమి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.  జగదీశ్వరరెడ్డిని అరెస్టు చేయాలంటే టీటీడీపీ అధ్యక్షుడు  రమణ డిమాండ్ చేశారు