నేటి నుంచి జనసేన జనతరంగం

జనసేన జనతరంగం కార్యక్రమానికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. ఈ ఉదయం 11 గంటలకు జనసేనాని పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జనతరంగం నేటి నుంచి 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో అంశాలను ప్రజలకు చేరువ చేస్తారు. ఇందు కోసం ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇంటింటికీ జనసేన సైనికులు జనసేన సిద్దాంతాలు, మేనిఫెస్టో, విజన్ డాక్యుమెంట్ అంశాలతో కూడిన కరపత్రాలను అందజేస్తారు. అనంతరం జనసేన సిద్దాంతాలకు వారి ఆమోదాన్ని ఫేస్ బుక్ లైవ్ లో ఉంచుతారు.