నేడు కొలువుతీరనున్న కమల్ నాథ్ కేబినెట్

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కేబినెట్ నేడు కొలువుదీరనుంది. అన్ని ప్రాంతాలు, కులాలకు సమ ప్రాధాన్యత నిస్తూ కమల్ నాథ్ కేబినెట్ మంత్రులను ఎంపిక చేసుకున్నారు. మొత్తం 20 మందితో ఆయన కేబినెట్ ఏర్పాటు చేయనున్నారు. డిగ్గీ రాజా కుమారుడు జయవర్దన్ సింగ్ కు తన కేబినెట్ లో చోటు కల్పించినట్లు చెబుతున్నారు. లఖన్ సింగ్ యాదవ్, జీతూపట్వారీ, ఆరిఫ్ అఖిల్ లకు కూడా కేబినెట్ లో స్థానం కల్పించినట్లు తెలుస్తోంది. ఉపముఖ్యమంత్రి సింధియా, అధినేత రాహుల్ తో చర్చించి కేబినెట్ సహచరుల ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ గా మహిళకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల జరిగిన మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాల కంటే ఒక స్థానం వెనుకబడిన నేపథ్యంలో బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసందే. కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా, జ్యోతిరాదిత్య సింధియా ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ రోజు మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది.