న్యూఢిల్లీ : ఆధార్ అక్కర్లేదు!

ఆధార్ అక్కర్లేదు, అదేమీ తప్పని సరి కాదంటూ కేంద్రం చట్టం చేయబోతోంది. పాన్ కార్డు లేని వారికి ఆధార్ ఇంకెంత మాత్రం తప్పని సరికాదు. వద్దనుకుంటే దాని నుంచి వైదొలగవచ్చు. ఆధార్ చెల్లుబాటుపై సుప్రీం తీర్పునకు అనుగుణంగా కేంద్రం చట్టంలో మార్పులు చేయడానికి సిద్ధమైంది. అయితే పాన్ కార్డునకు ఆధార్ అనుసంధానాన్ని సుప్రీం ఆమోదించిన నేపథ్యంలో పాన్ కార్డు ఉన్నవారు ఆధార్ నుంచి వైదొలగే అవకాశం ఉండది. పాన్ కార్డు లేని వారు తమకు వద్దనుకుంటే ఆధార్ నుంచి వైదొలగచ్చు.