న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా రాజీనామా

కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు అయిన ఉపేంద్ర కుష్వాహ గత కొంత కాలంగా మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పట్ల అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకు ముఖ్యకారణం ఎన్డీయేలో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి సరైన ప్రాతినిథ్యం లభించడం లేదని ఆయన ఇటీవల పలుమార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మంత్రిపదవికి రాజీనామా చేసి ఎన్డీయే నుంచి వైదొలగనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఉదయం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందుగా ఆయన రాజీనామా బీజేపీకి ఎదురుదెబ్బగానే చెప్పాలి.