న్యూఢిల్లీ : దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు-దారిమళ్లింపు

ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9.30 గంటలకు కూడా రోడ్లపై వాహనాలు లైట్లు వేసుకునే వెళ్లాల్సిన పరిస్థితి. ఎదురుగా ఉన్న వారు కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు విమానాలను దారి మళ్లించారు. మరి కొన్నింటిని రద్దు చేశారు.