పటేల్ రాజీనామా కోరలేదు: జైట్లీ

Share

రిజర్వ్ బ్యాంకు వివాదం ప్రభుత్వాన్ని వెన్నాడుతూనే ఉంది. ఉర్జిత్ పటేల్ రాజీనామా షాక్ నుంచి కేంద్రం ఇంకా తేరుకున్నట్లుగా కనిపించడం లేదు. ఉర్జిత్ పటేల్ రాజీనామా తరువాత ఒక సందర్భంలో కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఆర్బీఐ విధానాలు ఉండాలి అని స్పష్టం చేశారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుక అర్ధం.. ఉర్జిత్ పటేల్ ను కేంద్రమే సాగనంపిందనే నంటు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఉర్జిత్ పటేల్  రాజీనామాను కేంద్రం కోరలేదని చెప్పారు. రాజీనామా నిర్ణయం ఆయన నిర్ణయమేనని జైట్లీ పేర్కొన్నారు. ఆర్బీఐ బోర్డు సమావేశంలో ఉర్జిత్ పటేల్ తో సుహృద్భావ వాతావరణంలోనే జరిగాయని ఆయన పేర్కొన్నారు.

ఏది ఏమైనా ఉర్జిత్ పటేల్ రాజీనామా, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ కేంద్ర విధానాలపై వేస్తున్న చురకులు మోడీ సర్కార్ కు ఇబ్బందికరంగానే మారాయనడానికి ఇన్ని రోజుల తరువాత జైట్లీ ఇచ్చిన వివరణే కారణం. ఆర్బీఐ మిగులు నిల్వలను కేంద్రం ఖాతాకు బదలాయించాలనే విషయంలో ఆర్థిక నిపుణులు మోడీ సర్కార్ వైఖరిని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అరుణ్ జైట్లీ ఉర్జిత్ రాజీనామాను కోరలేదని వివరణ ఇచ్చారు.


Share

Related posts

టైంపాస్ కోసం అంటూ తెలియకుండానే చాలా పోషకాలను తీసుకుంటున్నారు…

Kumar

సంతానం పొందాలనుకునే ప్రతి ఒక్కరు ఈ రెండు ప్రశ్నలు వేసుకోండి..జీవితమే మారిపోతుంది!!

Kumar

బిగ్ బాస్ 4 : మొదలు కాకముందే అతిపెద్ద వివాదం .. ఇరకాటం లో స్టార్ మా ? 

sekhar

Leave a Comment