పాక్ లో భారత దౌత్యాధికారులకు వేధింపులు

పాకిస్థాన్ లో భారత దౌత్యాధికారులకు వేధింపులు ఎదురౌతున్నాయి. వారికి కొత్త గ్యాస్ కనెక్షన్ లు జారీ చేయకపోవడమే కాకుండా, అతిధులు ఆదేశంలో పర్యటిస్తున్న భారత దౌత్యాధికారులను ఇబ్బందులకు గురి  చేస్తున్నారు.

సీనియర్ అధికారులకు ఇంటర్ నెట్ సర్వీసులను బంద్ చేశారు. తాజాగా ఒక అగంతకుడు భారత దౌత్యాధికారి నివాసంలోనికి ప్రవేశించి హల్ చల్ చేశాడు. కాగా ఈ విషయాన్ని పాకిస్థాన్ దౌత్య అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు భారత్ పేర్కొంది. దౌత్యాధికారులపై వేధింపులు సరి కాదని పేర్కొంది.

SHARE