పాట్నాలో వాజ్‌పేయి విగ్రహం : నితీష్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దివంగత ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి 94వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో పాల్గొన్నారు. వాజ్‌పేయికి ఘన వివాళులర్పించిన నితీష్ కుమార్ పాట్నాలో వాజ్‌పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేశ ప్రగతిలో వాజ్‌పేయి చేసిన కృషి ఎన్నదగినదని ఆయన అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలను ఎలా నడపాలో ఆయన చూపారని నితీష్ కుమార్ అన్నారు. వాజ్ పేయి విగ్రహాన్ని ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటు చేసేదీ త్వరలోనే చెబుతామని పేర్కొన్నారు.