పుజారా హాఫ్ సెంచరీ

భారత్ -ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పట్టు బిగించింది. ఈ రోజు ఆట నాలుగో రోజు కడపటి వార్తలందే సరికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో భారత్ ను ఆదుకున్నఛటేశ్వర్ పుజారా రెండో ఇన్నింగ్స్ లో కూడా ఆపద్బాంధవుడిగా నిలిచి హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం పుజారా 66పరుగులతో ఆడుతున్నాడు, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే 32 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 250 పరుగులు చేయగా, ఆసీస్ 236పరుగులకు ఆలౌట్ అయ్యింది.