పెథాయ్ ఎఫెక్ట్ – పలు విమానాలు రద్దు

పెథాయ్ పెను తుపాను ప్రభావంతో పలు విమానాలు రద్దయ్యాయి. మరిన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 13 విమానాలు రద్దయ్యాయి. వాతావరణ ప్రతికూలత కారణంగా ఢిల్లీ- విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది. చెన్నై- విశాఖ విమానాన్ని తిరిగి చెన్నైకు మళ్లించారు. అలాగే హైదరాబాద్ -విశాఖ స్పైస్ జెట్ విమానం కూడా రద్దయ్యింది.

ఇక పలు రైళ్లు, బస్సులు రద్దు చేశారు. పెథాయ్ ప్రభావంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పలు చోట్ల రహదారులపై చెట్లు అడ్డంగా పడిపోయాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. మరి కొద్ది గంటలలో తూర్పుగోదావరి వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీ సర్కార్ తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆర్జీజీఎస్ ద్వారా సమీక్షిస్తున్నది.