పెద్దలు కుదిర్చిన పెళ్లి లో ఉన్న మజా ఇదే!! (పార్ట్ -1)

Share

ప్రతి వ్యక్తి  జీవితం లో  వివాహం అనేది చాల సహజం, అయితే ఆ  వివాహం  ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిర్చిన  వివాహమా అనేది ఆ యొక్క  వ్యక్తుల  ఇష్టం మీద ఆధార పడి ఉంటుంది. ప్రేమ పెళ్లి లో ఉన్నట్లుగా  పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో  లో ఇద్దరి మధ్య ముందు నుంచి ప్రేమ అనేది  ఏమీ ఉండదు. పెళ్లయ్యాకే ఇద్దరు  ప్రేమించుకోవాలి సి  ఉంటుంది.


భార్యాభర్తలిద్దరూ తమంతట తాము  ప్రయత్నం చేసి ఒకరికొకరు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది.ఇద్దరు కొన్ని విషయాల్లోఒకే అభిప్రాయం ఉంటే మరికొన్ని విషయాలు సర్దుకు పోవాల్సి ఉంటుంది. అప్పుడే పెద్దలు కుదిర్చిన వివాహం అయినప్పటికీ  ప్రేమ వివాహం కంటే అద్భుతంగా ఇద్దరి మధ్య అన్యోన్యత  పెరిగి  నిండు నూరేళ్లు ఇద్దరు ఆనందంగా ఉంటూ సంసారాన్ని స్వర్గంలా  మార్చుకునే అవకాశం  ఉంటుంది.
అందుకోసం భార్యా భర్తలు పాటించవలిసిన కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం.

ప్రేమ వివాహాల్లో  ముందు నుంచే ఇద్దరూ కలుసుకుంటారు. ఒకరిపై ఒకరికి, ప్రేమ, అవగాహన కలిగి ఉంటారు . కానీ పెద్దలు కుదిర్చిన వివాహాల్లో ఇవన్నీ పెళ్లి తర్వాత జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే పేమ వివాహంలో పెళ్ళికి ముందు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుని ఉండడం వలన పెళ్లి తర్వాత తెలుసుకోవడానికి పెద్దగా ఏమి ఉండదు. అదే పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే పెళ్లి అయినా తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఇద్దరు ఒకరికి ఒకరు కొత్తగానే ఉంటారు.

అందుకే పెళ్లి కాగానే మీ భాగస్వామి మీ తో ప్రేమగా వ్యవహరిస్తూ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని  ఆలోచించకండి .అలా జరగడానికి కాస్త  సమయం పడుతుంది అని  అర్థం చేసుకుంటే మంచిది.ముందుగా వివాహ జీవితంలో అవతలి వారి నుంచి మనకు కావలసింది  ఆశించే ముందు అది మనం అవతల వారికి ఇవ్వగలుగుతున్నామో  లేదో చూసుకోవాలి. అందుకోసం ముందుగా  మీ భాగస్వామి ఇష్టాయిష్టాలు తెలుసుకుని వాటికి తగినట్లుగా వ్యవహరించాల్సి ఉంటుంది.


Share

Related posts

వణుకు పుట్టిస్తున కరోనా కొత్త లక్షణం .. వామ్మో అంటున్న డాక్టర్లు !

sekhar

Remdisivir: సిగ్గుతో చ‌చ్చిపోదాం… రెమ్డిసివిర్ అయిపోయింది ఇప్పుడు బ్లాక్ ఫంగ‌స్ దందా

sridhar

బిగ్ బాస్ 4: పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నా మెహబూబ్..!!

sekhar