పెద్దలు కుదిర్చిన పెళ్లి లో ఉన్న మజా ఇదే!!(పార్ట్ -2)

Share

ఏ విషయంలో అయినా సరే ఎదుటివారు మన కోసం  ఎదో చేయాలని  ఆశించడం ప్రారంభిస్తే మనకు కచ్చితం గా  నిరాశే మిగులుతుంది. అంచ‌నాలు వ్యాపారంలో ఉండొచ్చు గానీ ప్రేమ‌లోకానీ వివాహంలోకానీ  అంత మంచిది కాదు అని గుర్తు పెట్టుకోవాలి. అందుకే ఎక్క‌డ తగ్గాలోతెలియడం తో పాటు   అసలు మీరు ఏం చేయ‌కూడ‌దో కూడా తెలుసుండాలి.


మీ మనసులో ఏముంది అనేది  మీరు చెబితే కానీ ఎదుటివారికి తెలియకపోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు మీ మనోభావాలు  స్పష్టంగా తెలియ చేయాలి . ముఖ్యంగా తొలి సంవత్సరం దీని గురించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి  ఉంటుంది. ఆ తర్వాత కాలం గడిచే  కొద్దీ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కాబట్టి మీ మనసులోని విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత  కేవలం మీ స్నేహితులతో మాత్రమే సమయం గడపడం మంచి పద్ధతి కాదు . మీ భాగస్వామి స్నేహితులతో మీరు సమయం గడపడం తో పాటు  వారిని మీ స్నేహితులకు పరిచయం చేయడం వంటివి చేయడంతో పాటు మీ ఇద్దరికి కూడా ఎక్కువ కలిసి గడిపేందుకు  సమయం కేటాయించు  కునేందుకు ప్రయత్నం  చేయాలి

ఇద్ద‌రు వ్య‌క్తులు ఎప్ప‌డూ ఒకేలా ఉండలేరు అనేది  ముందుగా  గుర్తు పెట్టుకోవాలిసిన విషయం . ఒకేలా ఆలోచించలేరు కూడా ఆ ఇద్దరు  భాగస్వాములు అయినా ఒక్కలా  అన్ని విషయాలు ఆలోచించ లేరు అన్నది  పచ్చి నిజం.ఒక చోట పుట్టి పెరిగిన అన్నదమ్ములు , అక్క చెల్లెలు కూడా ఒకే లా ఆలోచించలేరు ఇంకా ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన జీవిత భాగ‌స్వాములైనా వారి మ‌ధ్య వాదోప‌వాదాలు రావడం అనేది చాలా  చాలా స‌హజం అని గుర్తుపెట్టుకోండి . ఏదైనా సమస్య వచ్చినప్పుడు  నిజాయితీగా మాట్లాడుకోవ‌డం, ప్రేమించ‌డం, ఒక‌రినొక‌రు అర్థం చేసుకోవ‌డం, క్షమించుకోవడం  అనేది మీ  మధ్య ఉన్న బంధానికి   ఎంతో అవ‌స‌రం.


Share

Related posts

బిగ్ బాస్ 4 : ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి భారీ షాక్ ఇచ్చిన గంగవ్వ..! బయట ఉండే గేమ్ ఆడుతోంది

arun kanna

అమేజ్‌ఫిట్ కొత్త స్మార్ట్‌వాచ్‌.. ధ‌ర చాలా త‌క్కువ‌..!

Srikanth A

KCR : సోషల్ మీడియాలో రాజకీయ నాయకులను విమర్శిస్తున్నారా? మరి జైలుకి రెడీనా…?

siddhu