పెర్త్ టెస్ట్ -ఆస్ట్రేలియా 277/6

భారత్ – ఆస్ట్రలియా మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఈ రోజిక్కడ ప్రారంభమైన రెండో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ధాటిగా ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆ తరువాత తడబడింది. చివరికి ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక భారత బౌలర్లలో హనుమ విహారి రెండు, ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీసుకున్నారు. బుమ్రా,  ఉమేష్ యాదవ్ లు చెరో వికట్ పడగొట్టారు.