పెర్త్ టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం

పెర్త్ టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో భారత్ తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ తొలి టెస్ట్ గెలిచిన భారత్ ను రెండో టెస్టులో ఓడించి సిరీస్ ను 1-1తో సమం చేసింది.పెర్త టెస్ట్ లో పిచ్ ను తప్పుగా అంచనా వేసిన భారత్ స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగి మూల్యం చెల్లించుకుంది. టెస్ట్ ను 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగులు చేసింది. ప్రతిగా భారత్ 283 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 243 పరుగలు చేసి భారత్ కు 287పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే భారత్ 140 పరుగులకే ఆలౌట్ అయ్యింది.