పొగమంచు కమ్మేసింది!

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానరాకపోకలు నిలిచిపోయాయి. దట్టంగా పొగమంచు కమ్మేయడంతో విమానరాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది. విమాన రాకపోకలు ఎంత సేపటిలో ప్రారంభం అవుతాయన్న విషయాన్ని అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇలా ఉండగా ఉత్తర భారతం మొత్తం చలి గుప్పిట చిక్కుకుంది.

ఢిల్లీలో విమానాల రాకపోకలకే కాకుండా మంచు కారణంగా రోడ్లపై వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కూడా వాహనాలు హెడ్ లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి నెలకొంది. మంచు కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.