పోలవరం పనులకు బ్రేక్

పోలవరం పనులకు బ్రేక్ పడింది. కాంక్రీట్ పనులు జనవరికి వాయిదా పడ్డాయి. ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగంగా పోలవరం పనుల పూర్తికి యత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పెథాయ్ తుపాను కారణంగా పోలవరం పనులకు అనివార్యంగా బ్రేక్ పడింది. ఈ నెల 16, 17 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో…కాంక్రీట్ పనులను జనవరికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,069 కోట్ల రూపాయలు వ్యయం చేసిందనీ, కేంద్రం నుంచి ఇంకా 3,342 కోట్ల రూపాయలు రావలసి ఉందని చెప్పారు. ఉద్దేశ పూర్వకంగానే కేంద్రం నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నదని విమర్శించారు. పరుగలతోనూ క్రీజ్ లో ఉన్నారు.